📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌కు జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ దంపతుల శుభాకాంక్షలు

చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌కు జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ దంపతుల శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌కు జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ దంపతుల శుభాకాంక్షలు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ అక్టోబర్ 05 (ప్రజావాణి) :* చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ని జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం, మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రైతులకు అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించాలని సూచించారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో, మార్కెట్ యార్డ్‌లో సౌకర్యాలు మెరుగుపరచడంలో చైర్మన్ గా మీ పాత్ర కీలకమని, మీ నాయకత్వంలో చేర్యాల మార్కెట్ కమిటీ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.