📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగురుకుల పాఠశాలలో వైద్య పరీక్షలు

గురుకుల పాఠశాలలో వైద్య పరీక్షలు

📰 Generate e-Paper Clip

గురుకుల పాఠశాలలో వైద్య పరీక్షలు

ఎలుక కాటుతో బాధపడుతున్న విద్యార్థులను పరీక్షించిన డాక్టర్లు

నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి అక్టోబర్ 5 సోమవారం

మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేలకొండపల్లి ఆధ్వర్యంలో నేలకొండపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల యందు వైద్యాధికారి డాక్టర్ అర్జున్ గౌతమ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి ఎలుక కాటుతో బాధపడుతున్న విద్యార్థులను పరీక్షించి వారికి అవసరమైన టీకాలను ఇప్పించడంతోపాటు విద్యార్థినీ విద్యార్థులకు చిరు వ్యాధులు మరియు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేసి వైద్య శిబిరము నిర్వహించడం అయినది ఈ శిబిరం యందు జ్వరము మరియు ఇతర సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి మందులు పంపిణీ చేయడం అయినది. అదేవిధంగా కౌమార దశలు విద్యార్థిని విద్యార్థులకు రక్తహీనత పట్ల అవగాహన మరియు పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి వివరించడమైనది. అదేవిధంగా ఎలుక కాటుకు గురైన విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యవంతంగానే ఉన్నారని ఎటువంటి సమస్య లేదని ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమారి, ఆరోగ్య విస్తరణ అధికారి చంద్రశేఖర్, ఆరోగ్య కార్యకర్త రాణి ఆశా కార్యకర్త సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.