📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరైతులకు 16 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి

రైతులకు 16 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి

📰 Generate e-Paper Clip

*రైతులకు 16 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి…*

*సిపిఐ జిల్లా కార్యాలయం నుండి ఎస్సీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ.*

*సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ ఎస్సీ కార్యాలయం ముందు నిరసన ధర్నా.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05*

రైతులకు పంటల సాగుకు అవసరమైన 16 గంటల నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున భారత కమ్యూ నిస్టు పార్టీ (సిపిఐ) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో రైతులకు 16 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ముందుగా గoజ్ లోని సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఎస్సీ కార్యాలయం వరకు కొనసాగింది అనంతరం ఎస్సీ కార్యాలయంలోని ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు సకాలంలో కురవక పోవడంతో ఇప్పటికే పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటున్న నేపథ్యంలో, వ్యవ సాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత కీలకంగా మారిందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీటి కోసం ఆధార పడుతున్న బోర్లు , వ్యవ సాయ మోటార్లకు నిరంతర విద్యుత్ అవసరమని తెలిపారు. రైతులు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాలో కోతలు , అంతరాయాలు ఏర్పడితే పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అందు వల్ల వ్యవసాయానికి 16 గంటల నాణ్యమైన విద్యుత్‌ను హామీ మేరకు అందించడంతో పాటు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తక్షణ మే నివారించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి , వ్యవ సాయ విద్యుత్ సర ఫరాను పర్యవేక్షించి రైతు లకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కందాల సురేష్ ధర్నా వద్దకు వచ్చి సంబంధిత డీఈ , ఏఈలతో మాట్లాడి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ సమస్యను పరిష్కరించి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలపడం జరిగింది అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్య దర్శులు బోలగాని సత్య నారాయణ , చెడే చంద్రయ్య , జిల్లా కార్యవర్గ సభ్యులు గోద శ్రీరాములు , ఎండి ఇమ్రాన్ , కళ్లెం కృష్ణ గౌడ్ , ఏశాల అశోక్ , జిల్లా సమితి సభ్యులు కల్లేపల్లి మహేందర్ , గాదేగానీ మాణిక్యం , అన్నెపు వెంకట్ , అన్నేమైన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.