📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్భూ పంపిణీ అమలు కోసం కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా

భూ పంపిణీ అమలు కోసం కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా

📰 Generate e-Paper Clip

కడప జిల్లా అక్టోబర్ 05 ప్రజావాణి కాశి నాయన మండలం నాయన పల్లె రెవెన్యూ పొలంలో సర్వేనెంబర్ 129, 130 ,217 వందల ఎకరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి సోదరులు పెద్ద ఎత్తున భూ కబ్జాకు పాల్పడ్డారు. భూమిలేని నిరుపేదలకు గత 12 సంవత్సరాల నుంచి , సాగులో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ డిమాండ్ చేశారు.సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలకు భూ పంపిణీ అమలు చేయాలని, అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని, భూకబ్జాదాల భూములను స్వాధీనం చేసుకోవాలని ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ మాట్లాడుతూ రాష్ట్రం విభజన అయిన అనంతరం నుంచి ఇప్పటివరకు 14 సంవత్సరాలుగా పేదలకు భూ పంపిణీ అమలు చేయలేదు అన్నారు.టిడిపి, వైసిపి, కూటమి పరిపాలనలో భూ పంపిణీ అమలు చేస్తామని వాగ్దానాలు చేయటం తప్ప పాలకవర్గ ఆచరణలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.కాశి నాయన మండలం నాయన పల్లె రెవెన్యూ పొలంలో సర్వేనెంబర్ 129, 130 ,217 వందల ఎకరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి సోదరులు పెద్ద ఎత్తున భూ కబ్జాకు పాల్పడ్డారు ఆభూములను స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ యంత్రాంగం పోలీసు అధికారులు పూర్తిగా విఫలమైనారు అన్నారు.కాసినాయన, కలసపాడు ,పోరుమామిళ్ల ,బి కోడూరు, బ్రహ్మంగారిమఠం, అట్లూరు ,సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలలో వైసీపీ టీడీపీ ప్రభుత్వ హాయంలలో రాజకీయ నాయకులు రాజకీయ పలుకుబడి కలిగిన వారు ధనవంతులు లక్ష ఎకరాలు భూమాఫియాకు పాల్పడినారు అన్నారు.కూటమి ప్రభుత్వం ఏడాది క్రితం రెవెన్యూ సదస్సులు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అన్ని మండలాల్లో అటహాసంగా సదస్సులు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఒక ఎకరం భూకబ్జాదాల నుంచి స్వాధీనం చేసుకోలేక పోయిందన్నారు. ప్రభుత్వం, రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు భూ కబ్జాదాల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.వెంటనే కూటమి ప్రభుత్వం భూ పంపిణీ అమలు చేయాలని గత పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములలో సాగులో ఉన్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనల పోరాటాలు ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు స్వప్నమ్మ, సరస్వతి ,కోనేటి నరసయ్య, సురేష్ బాబు, ఈ రమణయ్య, వరి కుంట్ల బాబు,డేవిడ్ రాజ్,శేఖర్, అరవింద్ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ముంతాజ్ బేగం గుర్రమ్మ, పుష్పమ్మ కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెసల రఘు బండి జకరయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.