ముదిగొండ అక్టోబర్ 5 ప్రజావాణి ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, భారత ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని ముదిగొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ఎస్ఐఆర్ ప్రక్రియపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నెల 8వ తేదీన ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా ఖమ్మం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపూడి బుచ్చి రామయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, సిపిఐ పార్టీ కార్యదర్శి రావులపాటి శ్రీనివాసరావు, టిడిపి మండల కార్యదర్శి రామారావు, సిపిఐ ఎంఎల్ న్యూడెక్రసి నాయకులు ఉమా శంకర్, మధిర నియోజకవర్గం సబ్ ఇన్చార్జి మల్లెల అజయ్, ఐఎన్టియుసి మండల అధ్యక్షులు ఉసికల రమేష్, ముదిగొండ, సువర్ణాపురం గ్రామ సర్పంచ్ లు కట్టకూర్ ఉపేందర్, పసుపులేటి నాసరయ్య, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ కొమ్ము నరసింహారావు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు._

