బెజ్జం జానయ్యకు ఘన నివాళులు
గరిడేపల్లి, అక్టోబర్ 5(ప్రజావాణి )
గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు క్రీ.శే. బెజ్జం జానయ్య మృతి చెందడంతో పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయన పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ హుజూర్నగర్ మార్కెట్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కడియం వెంకట్‌రెడ్డి బెజ్జం జానయ్య పార్థివదేహంపై పార్టీ జెండా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం దేవరం సైదిరెడ్డి, ఉపసర్పంచ్ బెజ్జం స్వరూప, రెడబోతు శ్రీనివాస్‌రెడ్డి, రెడబోతు కృష్ణారెడ్డి, ఎడవెల్లి నర్సిరెడ్డి, అమరబోయిన వీరయ్య, వార్డు మెంబర్ వీరయ్య, మాధ వీరబాబు, రేవూరి సైదులు, యాట సైదులు, గోళ్ల వీరయ్య, ఠాగూర్, చల్ల వీరయ్య, బెజ్జం శ్రీను, నిమ్మల వీరస్వామి, నిమ్మల శ్రీను, రేవూరి వీరస్వామి తదితరులు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బెజ్జం జానయ్య మృతి పట్ల వారు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

