📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజడ్పీహెచ్ఎస్ సోమక్కపేటలో విద్యా ప్రమాణాల పరిశీలనకు బాహ్య మూల్యాంకనం ప్రారంభం

జడ్పీహెచ్ఎస్ సోమక్కపేటలో విద్యా ప్రమాణాల పరిశీలనకు బాహ్య మూల్యాంకనం ప్రారంభం

📰 Generate e-Paper Clip

విద్యార్థుల అభ్యసన స్థాయిలు, పాఠశాల విద్యా కార్యక్రమాల అమలుపై సమగ్ర అంచనా

చిలిపిచెడ్. అక్టోబర్ 5
ప్రజావాణి

చిలిపిచెడ్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ సోమక్కపేట పాఠశాలలో బాహ్య మూల్యాంకన కార్యక్రమాన్ని మండల విద్యాధికారి పి. విట్టల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన స్థాయిలు, విద్యా ప్రమాణాలు మరియు పాఠశాలలో విద్యా కార్యక్రమాల అమలును పరిశీలించారు. బాహ్య మూల్యాంకనాన్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను అంచనా వేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో శిబిర నిర్వాహకుడు నాగరాజు, సముదాయ ప్రధానోపాధ్యాయుడు డి. రమేష్, సీఆర్పీలు పాల్గొన్నారు.

విద్యార్థులు బాహ్య మూల్యాంకనంలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని మండల విద్యాధికారి పి. విట్టల్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.