జడ్పీహెచ్ఎస్ సోమక్కపేటలో విద్యా ప్రమాణాల పరిశీలనకు బాహ్య మూల్యాంకనం ప్రారంభం

విద్యార్థుల అభ్యసన స్థాయిలు, పాఠశాల విద్యా కార్యక్రమాల అమలుపై సమగ్ర అంచనా చిలిపిచెడ్. అక్టోబర్ 5 ప్రజావాణి చిలిపిచెడ్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ సోమక్కపేట పాఠశాలలో బాహ్య మూల్యాంకన కార్యక్రమాన్ని మండల విద్యాధికారి పి. విట్టల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన స్థాయిలు, విద్యా ప్రమాణాలు మరియు పాఠశాలలో విద్యా కార్యక్రమాల అమలును పరిశీలించారు. బాహ్య మూల్యాంకనాన్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను అంచనా వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిబిర నిర్వాహకుడు నాగరాజు, సముదాయ ప్రధానోపాధ్యాయుడు డి. రమేష్, సీఆర్పీలు...