📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రాణం ఖరీదు రూ. లక్ష.. చనిపోయాక వేరే ఆసుపత్రికి రిఫర్..

ప్రాణం ఖరీదు రూ. లక్ష.. చనిపోయాక వేరే ఆసుపత్రికి రిఫర్..

📰 Generate e-Paper Clip

మంచిర్యాల. ప్రజావాణి రిపోర్టర్ అక్టోబర్ 5 :

మంచిర్యాల పట్టణంలోని ప్రతిభ ఆసుపత్రిలో తల్లి బిడ్డ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది . ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి వచ్చిన మహిళ కడుపులోని బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో పురిటి నొప్పులతో ఉన్న ఆమెను ప్రైవేట్ అంబులెన్స్‌లో మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమె గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు.
తల్లికి గర్భంలోనే శిశువు మృతి చెందిన విషయం ముందే తెలిసినప్పటికీ, సకాలంలో శస్త్రచికిత్స (ఆపరేషన్) చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే రుబితి ప్రాణాలు కోల్పోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తీరా అక్క‌డికి వెళ్లాకే వైద్యులు ఆమె గర్భంలోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు
.
ప్రాణం ఖరీదు రూ.లక్ష..

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రూ.లక్ష ఇస్తామని వైద్యులు చెప్పినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కాళ్లు మొక్కుతామన్న కనికరం లేకుండా ప్రాణానికి వెలకట్టారని ఆరోపించారు. ఇలాంటి దారుణం ఏ బిడ్డకు జరగకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల పై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రిని సీజ్ చేయాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ గోడును వెల్లబోసుకున్నారు.

ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ధర్నా

ఈ విషయం వెలుగులోకి రావడంతో సోమవారం ఉదయం నుంచి మృతదేహంతో ప్రతిభ ఆసుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. తల్లీబిడ్డల మృతికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.