ఘట్కేసర్, అక్టోబర్ 4 (ప్రజావాణి): తెలంగాణ జన సమితి పార్టీని మేడ్చల్ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు సర్కిళ్ల వారీగా బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఘట్కేసర్‌లో ఆదివారం తెలంగాణ జన సమితి మేడ్చల్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ఇన్‌చార్జి పల్లె వినయ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు. మేడ్చల్ జిల్లాలోని అన్ని సర్కిళ్లకు బాధ్యులను నియమించి పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే కార్మిక విభాగం అధ్యక్షుడిగా సూరం నరసింహులను నియమించారు.
ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడిగా బచ్చు ప్రమోద్ గుప్తాను ఏకగ్రీవంగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి, మాణిక్యంతో పాటు ఘట్కేసర్‌కు చెందిన పలువురు మైనార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తెలంగాణ జన సమితిలో చేరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల దయాకర్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, వెంకటాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు లక్ష్మణ్, రవి, దయాకర్ గౌడ్, జాయింట్ సెక్రటరీ రాజు ముదిరాజు, కోశాధికారి సుమంత్, అధికార ప్రతినిధి ప్రవీణ్ ఆర్య, మహిళా సంఘం అధ్యక్షురాలు సుకన్యతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


