మేడ్చల్‌లో జన సమితి పటిష్టం.. సర్కిళ్ల వారీగా బాధ్యతలు
ఘట్కేసర్, అక్టోబర్ 4 (ప్రజావాణి): తెలంగాణ జన సమితి పార్టీని మేడ్చల్ జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు సర్కిళ్ల వారీగా బాధ్యతలు అప్పగిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఘట్కేసర్‌లో ఆదివారం తెలంగాణ జన సమితి మేడ్చల్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ఇన్‌చార్జి పల్లె వినయ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు...