📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonమృతుడి కుటుంబానికి లక్ష రూపాయల బీమా చెక్కు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్

మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల బీమా చెక్కు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్

📰 Generate e-Paper Clip

*మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల బీమా చెక్కు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్*

జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01(ప్రజావాణి):
జనగామ పట్టణంలోని గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఆయన కుటుంబానికి బీమా చెక్కును పంపిణీ చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ తెలిపారు.

జిల్లా లోని పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన వంగాల నాగరాజు (మంగళ నాగరాజు) అనే వ్యక్తి గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నాడు. ఇటీవల ఆటో యాక్సిడెంట్‌లో ఆయన మరణించారు.

ఖాతాదారులకు బ్యాంకు అందించే యాక్సిడెంటల్ బీమా పాలసీ లో భాగంగా, బాధితుడి తల్లిదండ్రులకు రూ.1,00,000/- (ఒక లక్ష రూపాయల) ఇన్సూరెన్స్ చెక్కును జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ చేతుల మీదుగా గురువారం అందించారు.
ఈ కార్యక్రమంలో గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ పోలు ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు అధ్యక్షులు మిద్దేపాక స్టాలిన్, పొన్నం గణేష్, చాప్పుల మహేష్, ఇందిరా గాంధీ, మాధవి, నాకతి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.