📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీజేపీ స్కూల్ కమిటీ సభ్యులకు ఘన సన్మానం

బీజేపీ స్కూల్ కమిటీ సభ్యులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

బీజేపీ స్కూల్ కమిటీ సభ్యులకు ఘన సన్మానం

కూడేరు అక్టోబర్ 01ప్రజావాణి మండల పరిధిలో ఇటీవల జరిగిన పాఠశాల కమిటీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో ఎన్నికైన స్కూల్ కమిటీ సభ్యులను బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్, బీజేపీ మండల అధ్యక్షులు బి. గోపాల్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని తెలిపారు.
బీజేపీ మద్దతుతో స్కూల్ కమిటీల్లో ప్రాతినిధ్యం లభించడం పట్ల నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోయిల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.