📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గా ఆర్.జె. సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు.

పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గా ఆర్.జె. సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు.

📰 Generate e-Paper Clip

కడప జిల్లా: పోరుమామిళ్ల అక్టోబర్ 1 ప్రజావాణి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గా ఆర్.జె.సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు నంద్యాల జిల్లా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ సిబ్బంది, పలువురు ప్రముఖులు నూతన సీఐకి ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతల స్వీకరణ అనంతరం సీఐ ఆర్.జె.సుబ్రహ్మణ్యం, పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలనైనా ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని అమలు చేస్తామని నూతన సీఐ తెలిపారు. బాధితులు ఎవరైనా సరే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలను నిస్సంకోచంగా చెప్పుకోవచ్చని ధైర్యం చెప్పారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు అణగారిన వర్గాల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.గతంలో నంద్యాల ట్రాఫిక్ సీఐగా పనిచేసిన తన అనుభవంతో ఇక్కడ కూడా నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గంజాయి విక్రయాలు, అక్రమ మద్యం రవాణా, జూదం వంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని కరాఖండిగా చెప్పారు. రాత్రి వేళల్లో గస్తీ (పెట్రోలింగ్)ని మరింత ముమ్మరం చేసి దొంగతనాలు, ఇతర నేరాలకు తావులేకుండా చూస్తామన్నారు.శాంతిభద్రతల పరిరక్షణ కేవలం పోలీసులతోనే సాధ్యం కాదని,ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా లేదా ఏదైనా చట్టవిరుద్ధమైన పనులు జరుగుతున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి, పరిధిలోని గ్రామాల శాంతిభద్రతల పరిస్థితిపై స్థానిక ఎస్సైలు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నిబద్ధతతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.