పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గా ఆర్.జె. సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు.
కడప జిల్లా: పోరుమామిళ్ల అక్టోబర్ 1 ప్రజావాణి సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గా ఆర్.జె.సుబ్రహ్మణ్యం గురువారం బాధ్యతలు స్వీకరించారు నంద్యాల జిల్లా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ సిబ్బంది, పలువురు ప్రముఖులు నూతన సీఐకి ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతల స్వీకరణ అనంతరం సీఐ ఆర్.జె.సుబ్రహ్మణ్యం, పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలనైనా...