ఘనంగా సాయిని రవి జన్మదిన వేడుకలు
* బొమ్మల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
జమ్మికుంట సెప్టెంబర్ 30 (ప్రజావాణి)
జమ్మికుంట, టీపీసీసీ కాంగ్రెస్ కరీంనగర్ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యులు సాయిని రవి జన్మదిన వేడుకలు జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకుని బొమ్మల గుడిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిని రవి ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న సాయిని రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు పార్టీకి సేవలందించాలని ఆకాంక్షించారుఅనంతరం సాయిని రవిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనతో తమ అనుబంధాన్ని చాటుకున్నారుకార్యక్రమంలో మండల కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు వీరమనేని పరశురాములుపిట్టల రమేష్, మార్కెట్ డైరెక్టర్ రాజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్, మాచర్ల వినయ్, దొడ్డే శ్రీకాంత్, శ్రీనివాస్, దేవేందర్, దుర్గ హాస్పిటల్ కిరణ్, శ్రీకాంత్, సాంబశివ, శ్రీపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

