మొండ్రాయి గ్రామంలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
సెప్టెంబర్ 30.ప్రజావాణి న్యూస్/ సంగెం
సంగెం మండల వ్యవసాయ అధికారి జగదీష్ మొండ్రాయి గ్రామంలో ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా దుకాణాల్లో నిల్వ ఉన్న ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల నాణ్యత, గడువు తేదీ, బ్యాచ్ నంబర్, లైసెన్స్ మరియు సంబంధిత రికార్డులను పరిశీలించారు.రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని, నిబంధనలకు విరుద్ధంగా నకిలీ లేదా గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని దుకాణ యజమానులకు సూచించారు.రైతులు కూడా ఎరువులు, విత్తనాలు మరియు పురుగు మందులను కొనుగోలు చేసే సమయంలో లేబుల్, తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నంబర్ మరియు నాణ్యత వివరాలను తప్పనిసరిగా పరిశీలించి, అధీకృత దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని సూచించారు.ముఖ్యంగా నకిలీ విత్తనాలు మరియు గడువు ముగిసిన పురుగు మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని రైతులకు అవగాహన కల్పించారు.రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.

