📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమాజీ కౌన్సిలర్ల కుటుంబాలకు అండగా మున్సిపల్ చైర్ పర్సన్

మాజీ కౌన్సిలర్ల కుటుంబాలకు అండగా మున్సిపల్ చైర్ పర్సన్

📰 Generate e-Paper Clip

*మాజీ కౌన్సిలర్ల కుటుంబాలకు అండగా మున్సిపల్ చైర్ పర్సన్*

*బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన కడకంచి బాలమణి-శ్రీనివాస్*

జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 30 (ప్రజావాణి ):
జనగామ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధుల కుటుంబాలకు మున్సిపల్ చైర్ పర్సన్ అండగా నిలిచారు.

పట్టణంలోని 30వ వార్డుకు చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు గొర్రె కిష్టయ్య, నమిలె ఎల్లయ్య కుటుంబాలను జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్బుధవారం పరామర్శించారు.

కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని నింపి, మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందించారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబం అంటే తమ కుటుంబమేనని, ఎల్లవేళలా అండగా ఉంటామని చైర్ పర్సన్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కష్టసమయంలో బాధిత కుటుంబాలకు తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆరుట్ల లోకమంత్ రెడ్డి , కాంగ్రెస్ జనగామ పట్టణ అధ్యక్షులు దోర్నాల వెంకటేశ్వర్లు , మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, వార్డు కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.