బిజెపి ఆధ్వర్యంలో సి ఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్దానికి యత్నం
అడ్డుకున్న మద్దూరు పోలీసులు
మద్దూరు సెప్టెంబర్ 30, ప్రజా వాణి,
శ్రీ రాముడు,పరమ శివుడిపై సి ఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రామచంద్రరావు పిలుపుమేరకు మద్దూరు మండల అధ్యక్షుడు మోకు ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ఎక్కించగా మద్దూర్ ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా మద్దూరు మండల అధ్యక్షుడు ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ దేవుళ్లను రాజకీయాలకు వర్గాలకు ముడి పెడుతూ వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ జులుం నశించాలి అంటూ నినాదాలు చేస్తు సి ఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఈకార్యక్రమంలో సోగాల మనోజ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి,ఉపసర్పంచ్ బియ్య రమేష్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి సిరిమల్లె సురేష్, మండల ఉపాధ్యక్షులు కుంభం రవీందర్ రెడ్డి, మండల కార్యదర్శి కుక్కల కనకయ్య, కిసాన్ మోర్చా నాయకులు దాసరి కృష్ణారెడ్డి, కార్యకర్త నారదాసు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

