📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonజనగామలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

జనగామలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

*జనగామలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ*

*జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ*

జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 29 (ప్రజావాణి):
జనగామ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

జనగామ పట్టణానికి చెందిన 19 మంది, జనగామ రూరల్ ప్రాంతానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని, పేద, మధ్యతరగతి కుటుంబాలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.