📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaకార్మికుల హక్కుల పోరాటమే లక్ష్యం: బీజేపీ లేబర్ సెల్ నాయకులు

కార్మికుల హక్కుల పోరాటమే లక్ష్యం: బీజేపీ లేబర్ సెల్ నాయకులు

📰 Generate e-Paper Clip

 

పెద్దపల్లి జిల్లా కమిటీల నియామకం.. గోదావరిఖనిలో నియామక పత్రాల అందజేత

గోదావరిఖని సెప్టెంబర్ 29 ప్రజావాణి :

కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తామని బీజేపీ లేబర్ సెల్ నాయకులు స్పష్టం చేశారు. బీజేపీ లేబర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అందె శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి, రామగుండం నియోజకవర్గ ఇంచార్జి కందుల సంధ్యారాణిల సూచనల మేరకు లేబర్ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ తడగొండ నర్సయ్య ఆధ్వర్యంలో పలువురికి నూతన బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు లేబర్ సెల్ జిల్లా కో-కార్యవర్గ సభ్యులు, మండలాల కో-కన్వీనర్లు, సోషల్ మీడియా ఇంచార్జ్‌లను నియమించారు.

ఈ నియామకాల్లో భాగంగా పాలకుర్తి మండల కన్వీనర్‌గా బైరి తిరుపతి గౌడ్, పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా చీలుముల సాగర్, ఎన్టీపీసీ మండల కో-కన్వీనర్‌గా సి.హెచ్. నరేందర్, ఎన్టీపీసీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా జి. రాజ్ కుమార్ నియమితులయ్యారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లేబర్ సెల్ జిల్లా కన్వీనర్ తడగొండ నర్సయ్య, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు ఎల్తూరి సరిత, జిల్లా లేబర్ సెల్ కో-కన్వీనర్ ఎల్తూరి రాజయ్య, ఎన్టీపీసీ మండల కన్వీనర్ ఎరుకొండ తిరుపతి నూతనంగా ఎంపికైన నాయకులకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాయకులు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం జరిగే ప్రతీ పోరాటంలో ముందుండి నడుస్తామని, వారి సమస్యల పరిష్కారానికి, న్యాయం జరగడానికి శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.