*ప్రజాపాలనకు అందరి భాగస్వామ్యం అవసరం*
*అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి:*
*ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి*
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజాపాలన సమర్థవంతంగా సాగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించి పలు సూచనలు చేశారు.
అనవసర విద్యుత్ కోతలు వద్దు: ప్రభుత్వం నిర్దేశించిన మేరకు విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ పనుల కోసం వారానికి ఒక్కరోజు, రెండు గంటలకు మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సూచించారు. అనవసరంగా విద్యుత్ కోతలు విధిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ వైద్యసేవలపై అవగాహన కల్పించాలి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు, నాణ్యమైన మందులు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అధిక ఖర్చులకు గురికాకుండా ప్రభుత్వ వైద్యసేవలను వినియోగించుకునేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులను సూచించారు. ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ ఆస్పత్రిని అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల అభివృద్ధిలో కార్యదర్శులదే కీలక పాత్ర: పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అక్రమ మట్టి వ్యాపారం, డబ్బు వసూళ్లు, ఇతర అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కింది స�

