ప్రజాపాలనకు అందరి భాగస్వామ్యం అవసరం
*ప్రజాపాలనకు అందరి భాగస్వామ్యం అవసరం* *అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి:* *ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి* ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 29 (ప్రజావాణి): ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజాపాలన సమర్థవంతంగా సాగుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించి పలు సూచనలు చేశారు. అనవసర విద్యుత్ కోతలు వద్దు: ప్రభుత్వం నిర్దేశించిన మేరకు విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు....