📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకష్టకాలంలో బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి అండ మృతుల కుటుంబాలకు తిరుపతిరెడ్డి పరామర్శ

కష్టకాలంలో బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి అండ మృతుల కుటుంబాలకు తిరుపతిరెడ్డి పరామర్శ

📰 Generate e-Paper Clip

కష్టకాలంలో బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి అండ
మృతుల కుటుంబాలకు తిరుపతిరెడ్డి పరామర్శ..

ఆపదలో నేనున్నానంటూ.. బాధితులకు తిరుపతిరెడ్డి ధైర్యం

కన్నీటి కుటుంబాలకు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి భరోసా

బాధితుల ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన తిరుపతిరెడ్డి

బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి భరోసా

మెదక్ జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 29

మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు

శంకరంపేట: ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, బాధితుల కష్టాల్లో భాగస్వామిగా ఉంటున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మంగళవారం శంకరంపేట మండలంలో పర్యటించారు. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

మండలంలోని చందంపేట్‌ గ్రామానికి చెందిన విలేకరి తాటికొండ సుధాకర్‌ తండ్రి కృష్ణ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణ మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

అనంతరం జంగారాయ గ్రామానికి చెందిన బొమ్మరబోయిన కృష్ణ కుమార్తె కీర్తన ప్రైవేట్‌ బస్సు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకుని ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. కీర్తన మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, వారికి అండగా ఉంటానని తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమాల్లో గ్రామ అధ్యక్షుడు గడ్డం సురేష్‌, మాజీ మార్కెట్‌ డైరెక్టర్‌ బందెల ప్రభాకర్‌, సొసైటీ డైరెక్టర్‌ చౌటకూరి శ్యామ్‌, యూత్‌ అధ్యక్షుడు దుర్గం మహేష్‌గౌడ్‌, సిద్ధ రాములు, బందెల బన్ని, కరోల అనిల్‌, దేవదాస్‌, ముత్యాలు, భూపాల్‌రెడ్డి, గడ్డం నందు, నరసింహులు, మాజీ ఉపసర్పంచ్‌ లక్ష్మీపతి, ఎస్సీ సెల్‌ మండల ఉపాధ్యక్షుడు బందెల సుధాకర్‌, మాజీ సర్పంచ్‌ కుమార్‌గౌడ్‌, మాజీ వైస్‌ ఎంపీపీ సత్యనారాయణగౌడ్‌, రామాయపల్లి సర్పంచ్‌ రేణుక తిరుపతి, మాజీ సర్పంచ్‌ గుగులోత్‌ సుధాకర్‌, మాజీ ఎంపీటీసీ బాచుపల్లి యాదగిరి, మాజీ సర్పంచ్‌ తోట రమేష్‌, గజగట్లపల్లి ఉపసర్పంచ్‌ రాజు, మండల నాయకులు తిగుళ్ల స్వామి, లాలు, దుర్గయ్య, గోపాల్‌నాయక్‌, అతెల్లి నాగరాజు సురేష్‌గౌడ్, పాండు, మోహన్‌, నవీన్‌, ప్రభాకర్‌, రాజు, రమేష్‌, ఆకాష్‌, రంజిత్‌, కార్తీక్‌, దాసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.