📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గుగ్గిళ్లలో రోడ్డుపై గుంత.. వాహనదారులకు ఇబ్బందులు

గుగ్గిళ్లలో రోడ్డుపై గుంత.. వాహనదారులకు ఇబ్బందులు

📰 Generate e-Paper Clip

ప్రమాదం పొంచి ఉందంటూ యువకుల హెచ్చరిక బోర్డు ఏర్పాటు

ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని ప్రజల విజ్ఞప్తి

బెజ్జంకి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో పోచమ్మ దేవస్థాన ఆవరణ సమీపంలోని ప్రధాన రహదారిపై గత కొన్ని రోజులుగా గుంత ఏర్పడి వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై గుంత కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదాన్ని గుర్తించిన గ్రామ యువకులు వాహనదారులను అప్రమత్తం చేసేందుకు గుంత వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. యువకుల చొరవను గ్రామ ప్రజలు, వాహనదారులు అభినందించారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రహదారిపై ఏర్పడిన గుంతను వెంటనే పూడ్చి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.