📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి

గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి

📰 Generate e-Paper Clip

గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి
ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మొలుగు ఆనంద్ రావు పిలుపు

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి)

ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ నాయకులు మొలుగు ఆనంద్ రావు పిలుపునిచ్చారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహిస్తూ గుండె జబ్బుల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతిరోజూ వ్యాయామం, నడక, యోగా చేయడంతో పాటు పండ్లు, ఆకుకూరలు వంటి పోషకాహారాన్ని తీసుకోవాలని తెలిపారు. ధూమపానానికి దూరంగా ఉంటూ, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలని సూచించారు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆరోగ్యకరమైన అలవాట్లతో గుండె జబ్బులను నివారించవచ్చని మొలుగు ఆనంద్ రావు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.