📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalచెత్తపై యుద్ధం.. పరిశుభ్రతకు పట్టం..కస్తూరిబా విద్యార్థుల సందేశం

చెత్తపై యుద్ధం.. పరిశుభ్రతకు పట్టం..కస్తూరిబా విద్యార్థుల సందేశం

📰 Generate e-Paper Clip

చెత్తపై యుద్ధం.. పరిశుభ్రతకు పట్టం..కస్తూరిబా విద్యార్థుల సందేశం

చెన్నారావుపేట సెప్టెంబర్ 28 ప్రజావాణి

 

వ్యక్తిగత పరిశుభ్రతే కాదు.. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం పౌరులుగా మనందరి ప్రాథమిక బాధ్యత అని స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ‘స్వచ్ఛతే సేవ’కార్యక్రమం లో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక కస్తూరిబా జూనియర్ కళాశాల మరియు పాఠశాలలో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని, తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ తమ ఇంటితో పాటు వీధులను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో ‘స్వచ్ఛతా ప్రతిజ్ఞ‘ చేయించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రదర్శనా ర్యాలీలో పరిసరాల పరిశుభ్రత, డెంగ్యూ-మలేరియా వంటి వ్యాధుల నివారణపై విద్యార్థులు బిగ్గరగా నినాదాలు చేస్తూ గ్రామస్థులకు చైతన్యం కలిగించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ, ఏపీఎం, ఎస్‌బీఎమ్ కోఆర్డినేటర్, ఎంఎస్‌పీ, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు,విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.