చెత్తపై యుద్ధం.. పరిశుభ్రతకు పట్టం..కస్తూరిబా విద్యార్థుల సందేశం
చెత్తపై యుద్ధం.. పరిశుభ్రతకు పట్టం..కస్తూరిబా విద్యార్థుల సందేశం చెన్నారావుపేట సెప్టెంబర్ 28 ప్రజావాణి వ్యక్తిగత పరిశుభ్రతే కాదు.. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం పౌరులుగా మనందరి ప్రాథమిక బాధ్యత అని స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. 'స్వచ్ఛతే సేవ'కార్యక్రమం లో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక కస్తూరిబా జూనియర్ కళాశాల మరియు పాఠశాలలో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని, తడి-పొడి చెత్తను...