మీడియా ముసుగులో అక్రమ దందా. సిగ్నేచర్ స్టూడియో ఉపేందర్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంగు మురళి గౌడ్
పెద్దవంగర సెప్టెంబర్ 28 ప్రజావాణి
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన పూజపై సిగ్నేచర్ స్టూడియో విలేకర్ జాటోతు ఉపేందర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
సిగ్నేచర్ స్టూడియో జాటోత్ ఉపేందర్ వీడియో ముసుగులో అక్రమాలకు, ప్రజల నుండి వసూళ్లకు పాల్పడుతున్నాడు. గతంలో “ఫ్లయింగ్ స్క్వాడ్” పేరుతో లక్షలు దండుకున్న చరిత్ర ఉంది. అలాంటివి మరవకముందే నిన్నటికి నిన్న మీడియా ముసుగులో తల్లిదండ్రులతో కలిసి అక్రమ గుడుంబా దందా నడిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాడు.
నీతిమాలిన పనులు చేస్తూ మా నాయకుల కుటుంబాలపై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు సంకేపల్లి రవీందర్ రెడ్డి , పెద్దవంగర మండల ఉపాధ్యక్షులు దాసరి శ్రీనివాస్ , పన్నీరు వేణు, బీసీ సెల్ అధ్యక్షులు సైదులు గౌడ్, రామోజీ తండా సర్పంచ్ గుగులోతు సోమన్న, జాటోత్ వెంకన్న, అనిల్ గౌడ్, మాలే మోహన్ రావు, మండల ఉపాధ్యక్షులు ఆవుల మహేష్, యూత్ నాయకులు వల్లపు హరీష్ యాదవ్, జలగం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

