📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅనారోగ్యంతో మృతి చెందిన రాజేశం కుటుంబానికి ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆర్థిక సహాయం

అనారోగ్యంతో మృతి చెందిన రాజేశం కుటుంబానికి ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

అనారోగ్యంతో మృతి చెందిన రాజేశం కుటుంబానికి ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆర్థిక సహాయం

భిక్కనూర్, సెప్టెంబర్ 28 ( ప్రజావాణి ):

భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కన్నె రాకేష్ తండ్రి కన్నె రాజేశం అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఎస్.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రాజేశం అంత్యక్రియల నిమిత్తం తనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సుభాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనగామ, బీబీపేట్, పెద్ద మల్లారెడ్డి, సీతారాంపల్లి, కాచాపూర్ గ్రామాలకు చెందిన ఎస్.ఆర్. ఫౌండేషన్ సభ్యులు పాల్గొని రాజేశం కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించడం పట్ల స్థానికులు ఫౌండేషన్ ప్రతినిధులను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.