📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialభోజన ప్రియులకు 'కల్తీ' గండం!

భోజన ప్రియులకు ‘కల్తీ’ గండం!

📰 Generate e-Paper Clip

జైపూర్ మండలంలో కల్తీ ఆహారం విక్రయాలు

రోజుల తరబడి ఫ్రిజ్‌లోనే మురిగిన మాంసం

మామూళ్ల మత్తులో పర్యవేక్షణ యంత్రాంగం

అధికారులపై స్థానికుల  ఆరోపణలు

జైపూర్, సెప్టెంబర్ 28,ప్రజావాణి:

రుచికరమైన భోజనం కోసం హోటళ్లకు వస్తున్న ప్రజలకు కల్తీ రోగాలే వడ్డనవుతున్నాయి.మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని పలు హోటళ్లు, దాబాల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు పర్యవేక్షించకపోవడం, వ్యాపారులు మేనేజ్ చేసుకుంటుండటంతో నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారని ఆరోపిస్తూ, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*కల్తీ నూనెలు.. మురిగిన మాంసం!* 

వంట తయారీలో అత్యంత నాసిరకం, కల్తీ నూనెలను ఉపయోగిస్తున్నారు. బిర్యానీలు, కూరల కోసం రోజుల తరబడి ఫ్రిజ్‌లలో ఉంచిన మురిగిన మాంసాన్నే వాడుతున్నారు. ఆ వాసన తెలియకుండా కృత్రిమ రంగులు, తీవ్రమైన మసాలాలు నూరిపోసి వడ్డిస్తున్నారు. ఈ ఆహారం తిని పలువురు కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్ బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అటు కూరగాయల పరిస్థితి అంతే ఉందని,రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో బూజు పట్టిన కుళ్ళిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని,ఒక రోజు ముందు చేసిన కూరలను వేడి చేసి తెల్లవారు రోజున పెడుతున్నారని,సంబంధిత అధికారులకు తెలిసినా ప్రయోజనం శూన్యం అని ప్రజలు బాహాటంగానే తెలియపరుస్తున్నారు.

*లైసెన్సులు లేవు.. అధికారుల పర్యవేక్షణ శూన్యం!* 

ఫుడ్ సేఫ్టీ (FSSAI) నిబంధనల ప్రకారం కనీస అనుమతులు కూడా లేకుండానే పలు హోటళ్లు నడుస్తున్నాయని,వంట గదులు బొద్దింకలు, ఈగలతో అత్యంత అపరిశుభ్రంగా మారాయని ,అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టకపోవడం, వ్యాపారుల నుంచి మామూళ్లు పుచ్చుకుని వెనుదిరగడంతో నిర్వాహకుల ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

*కఠిన చర్యలు తీసుకోవాలి* 

వినియోగదారుల ప్రాణాలతో ఆడుకుంటున్న హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలను సీజ్ చేసి, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని,మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వీటిపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని,తమ ఆరోగ్యాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.