భోజన ప్రియులకు ‘కల్తీ’ గండం!
జైపూర్ మండలంలో కల్తీ ఆహారం విక్రయాలు రోజుల తరబడి ఫ్రిజ్‌లోనే మురిగిన మాంసం మామూళ్ల మత్తులో పర్యవేక్షణ యంత్రాంగం అధికారులపై స్థానికుల ఆరోపణలు జైపూర్, సెప్టెంబర్ 28,ప్రజావాణి: రుచికరమైన భోజనం కోసం హోటళ్లకు వస్తున్న ప్రజలకు కల్తీ రోగాలే వడ్డనవుతున్నాయి.మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని పలు హోటళ్లు, దాబాల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వినియోగదారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు పర్యవేక్షించకపోవడం, వ్యాపారులు మేనేజ్ చేసుకుంటుండటంతో నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారని ఆరోపిస్తూ, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. *కల్తీ నూనెలు.. మురిగిన...