📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా ముగిసిన టైక్వాండో ఛాంపియన్‌షిప్ - 2026*

ఘనంగా ముగిసిన టైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2026*

📰 Generate e-Paper Clip

*ఘనంగా ముగిసిన టైక్వాండో ఛాంపియన్‌షిప్ – 2026*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి):
జనగామ జిల్లా స్థాయి టైక్వాండో ఛాంపియన్‌షిప్‌ను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని కిక్స్, పంచింగ్, పూమ్సే తదితర విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.

విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ముఖ్యఅతిథులు జనగామ జిల్లా ఎస్ఐ చెన్నకేశవులు, డాక్టర్ రాజమౌళి, జనగామ జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాస్టర్ ఎండి అబ్బాస్ మాట్లాడుతూ టైక్వాండో ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. జిల్లాలోని క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్స్ మెరుగు క్రాంతి, సిహెచ్ అనూష, బానోతు రుద్ర, రిఫరీలు బానోతు సంతోష్ తదితరులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.