*విదేశీ ఉద్యోగాలపై సహాయం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు…*
*యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్. పద్మ వెల్లడి.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28*
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతకు సురక్షితమైన , పారదర్శక మైన , చట్టబద్ధమైన విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ తెలిపారు.
విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం అందించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో అందు బాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల పై అవగాహన కల్పిస్తున్నారు. నర్సింగ్ , హెల్త్‌కేర్ , కేర్‌గివర్ , డ్రైవింగ్ , నిర్మాణ , వ్యవ సాయం తదితర రంగాల్లో అర్హతలను బట్టి విదేశీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
విదేశీ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ అధికారిక నమోదు ప్రక్రియ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని , మధ్యవర్తులు లేదా అనధి కార వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్:
https://forms.gle/b1RHKvaggVYBgwHV8
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ హెల్ప్‌లైన్ / వాట్సాప్: 08035524946 ని సంప్రదించాలన్నారు.
విదేశీ ఉద్యోగ అవకాశాలపై మరిన్ని వివరాలు , అర్హతలు మరియు నమోదు ప్రక్రియకు సంబంధించి జిల్లా ఉపాధి అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ కోరారు.

