📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేవు

చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేవు

📰 Generate e-Paper Clip

చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేవు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి మార్కాపురం జిల్లా సెప్టెంబర్ 26.

మార్కాపురం జిల్లా ‘స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు’ కార్యక్రమానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు చేపట్టనున్న ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు మంజూరు కాలేదని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ తెలిపారు.

అనుమతులు లేకుండా నిర్వహించే కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొనవద్దని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చట్టపరమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా విజ్ఞప్తి చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.