📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకొరవడిన అధికారుల పర్యవేక్షణ

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

📰 Generate e-Paper Clip

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

మంచినీటి కోసం అవస్థలు పడుతున్న ప్రజలు

ప్రత్యామ్నాయ మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్న ప్రజలు

మహబూబాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజా వాణి ) భగీరథ నీళ్లు రాక మంచినీటి కోసం చిన్నకిష్టాపురం గ్రామం పంచాయతీ ప్రజలు అవస్థలు పడుతున్నారు.ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకం పై అధికారుల పర్యవేక్షణ కరువైంది.మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోయి చిన్నకిష్టాపురం దేశ్యతండా ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొద్దాక కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తే పశువులకు తాగడానికి, ప్రజలకు స్నానాలకు కూడా నీళ్లు లేకపోవడంతో చిమ్మచికట్లలో బిందెలు, బకెట్లు పట్టుకొని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ బోరింగుల వద్ద నీళ్లు పట్టుకొని రావాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరథ పైపు లీకేజీల పేరుతో రోజుల తరబడి నీటి సరఫరా నిలిపివేయడంతో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తక్షణమే ప్రత్యామ్నాయ మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.