📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamప్రజా దరఖాస్తులు నిర్ణీత గడువులో పరిష్కరించాలి

ప్రజా దరఖాస్తులు నిర్ణీత గడువులో పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

ప్రజా దరఖాస్తులు నిర్ణీత గడువులో పరిష్కరించాలి…!

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, వేగవంతంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.

శనివారం మధిర నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, కార్యాలయ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మండల పరిధిలోని మొలుగుమాడు గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహించిన రీసర్వే వివరాలు, డేటా ఎంట్రీ పక్రియను పరిశీలించారు. రీసర్వే అనంతరం రైతులకు నూతన పాసుపుస్తకాల జారీ ప్రక్రియపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు.

ఎర్రుపాలెం మండలంలో మొదటి విడుదలతో ఐదు గ్రామాలలో చేపడుతున్న భూ సర్వే పంచనామ పత్రాలు, కంప్యూటర్ డెటా ఎంట్రీ విధానంను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడుతూ, భూ రీ-సర్వే ఉద్దేశ్యం, చేపడుతున్న ప్రక్రియపై అవగాహన కల్పించాలని, రైతుల సందేహాలు, అనుమానాలను అడిగి తెలుసుకుని, వాటిని నివృత్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి అపోహలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే ప్రతి అంశాన్ని పరిశీలించి నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమ పురోగతిపై ఆరా తీశారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనామిలిస్, మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను బిఎల్ఓ లు యాప్ లో నమోదు చేసే విధానం, ప్రత్యక్షంగా హియరింగ్ కు హాజరైన ఓటర్ల కు ఎదురై సమస్యలను పరిషార్కంలో ఎలాంటి లోటుపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న వివిధ దస్త్రాలు, స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్లు, సాదా బైనామా దరఖాస్తులు, భూ భారతి దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించారు. ప్రజలకు సంబంధించిన భూ సమస్యలు ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్, కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులు, ఇతర సేవలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందించే సేవల విషయంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యల సంబంధించిన దరఖాస్తులను సాధ్యమైనంత వరకు మండల స్థాయిలోనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. మండల కార్యాలయాలకు వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం మధిర మండలంలోని దెందుకూరు గ్రామంలో రైల్వే మూడవ లైను వలన పలు రైతులకు పోలాలకు వెళ్ళే రోడ్డు ఇబ్బందుల విషయమై రైల్వే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చి, తగువిధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, మధిర మండల తహసీల్దారు రాంబాబు, ఎర్రుపాలెం మండల తహసీల్దార్ సునీత ఎలిజబెత్, డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి, ఆర్‌ఐ శిరీష, సర్వేయర్ రాజశేఖర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.