ప్రజా దరఖాస్తులు నిర్ణీత గడువులో పరిష్కరించాలి
ప్రజా దరఖాస్తులు నిర్ణీత గడువులో పరిష్కరించాలి...! జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, వేగవంతంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం మధిర నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, కార్యాలయ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మండల పరిధిలోని మొలుగుమాడు...