తల్లంపాడులో ఉచిత కంటి వైద్య శిబిరం
ప్రజావాణి పాలేరు, సెప్టెంబర్ 26:
ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఖమ్మం జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సహకారంతో, శరత్ మాక్సిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి మేనేజ్మెంట్ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకాంత్ కోఆర్డినేటర్, ఈశ్వర్ ఆప్టం, వినయ్ ఆప్టం, మరియు పాష ఈ శిబిరంలో గ్రామంలోని పలువురు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి సమస్యలను గుర్తించారు. అవసరమైన వారికి వైద్యుల సూచనలు, సలహాలు అందించారు. కంటి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు
. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుమ్మరి అంబేద్కర్, పుచ్చకాయల నరేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని శిబిరానికి వచ్చిన వారికి సహకరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, నిర్వాహకులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

