*వినాయక నిమజ్జన మహోత్సవానికి మర్రి నిరంజన్ రెడ్డికి ఆహ్వానం* అల్ ఫ్రెండ్స్ యూత్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల: సెప్టెంబర్ 26 (ప్రజావాణి),ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండల కేంద్రంలో ఆల్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన మహోత్సవాన్ని ఈ నెల 27వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మర్రి నిరంజన్ రెడ్డిని ఆల్ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు కలిసి ఆహ్వానించారు.
వినాయకుని ఆశీస్సులతో, యువత ఐక్యతతో భక్తిశ్రద్ధల మధ్య నిమజ్జన వేడుకను విజయవంతంగా నిర్వహించాలని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా మర్రి నిరంజన్ రెడ్డి హాజరైతే యువతలో మరింత ఉత్సాహం నెలకొనడంతో పాటు నిమజ్జన వేడుకకు మరింత శోభ చేకూరుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శేఖర్‌తో పాటు ఆల్ ఫ్రెండ్స్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

