రామచంద్రాపురం గ్రామంలో భీముడు యువ సేన ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం.

ముఖ్యఅతిథిగా హాజరైన మండల పార్టీ అధ్యక్షుడు భూక్య మంజు నాయక్.

హుజూర్నగర్ సెప్టెంబర్ 26 (ప్రజావాణి)
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండలం లోని రామచంద్రాపురం గ్రామంలో భీముడు యువసేన ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది. గణేష్ ని 11 రోజులు భక్తిశ్రద్ధలతో పూజిస్తూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి రామచంద్రపురం, భోజ్య తండా, భీమ్లా తండా, కృష్ణ తండా, మట్టపల్లి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్నప్రసాదాల వితరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు భీముడు యువసేన కమిటీ సభ్యులు చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రపురం మాజీ సర్పంచ్ మాలోతు బుజ్జి భీముడు నాయక్, రామచంద్రపురం గ్రామ శాఖ అధ్యక్షుడు రూపావత్ పటేల్ నాయక్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు ధరావత్ నవీన్ నాయక్, ఒంటి పులి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ రామచంద్రయ్య, సేవాలాల్ కన్వీనర్ తులసి రామ్ నాయక్, రామచంద్రాపురం ఉప సర్పంచ్ మాలోతు రాజు నాయక్, రామచంద్రపురం వార్డు సభ్యులు, సర్పంచ్లు నరసింహారావు, బోసు నాగు, మాజీ కౌన్సిలర్ రవి నాయక్, సైదులు, రాముడు, కోటేశ్ నాయక్, గ్రామ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.

