📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎంబీబీఎస్ సీటు సాధించిన గాజుల పద్మావతికి ఘన సన్మానం

ఎంబీబీఎస్ సీటు సాధించిన గాజుల పద్మావతికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

*ఎంబీబీఎస్ సీటు సాధించిన గాజుల పద్మావతికి ఘన సన్మానం*

* *మన ప్రజావాణి* మందమర్రి:-

పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గాజుల శంకర్ కుమార్తె గాజుల పద్మావతి నీట్ లో ఉత్తమ ర్యాంకు సాధించి, ఎంబీబీఎస్ సీటు పొందిన సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఆర్ఎంపీ భవన్ లో మందమర్రి పట్టణ, గ్రామీణ ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అనుభవ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం ఆద్వర్యంలో పద్మావతిని శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందన పత్రాన్ని అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ వైద్యులు, ఆర్ఎంపీ లు, పిఎంపీ ల కుటుంబాల నుంచి సైతం ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి, భవిష్యత్తులో వైద్య వృత్తిలోకి రావాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించిన గాజుల పద్మావతి విజయం, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, ఆమె భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి, సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం పట్టణ అధ్యక్షుడు గోనే గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి అడ్డూరి సాంబమూర్తి, గౌరవ అధ్యక్షులు కట్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంద తిరుమల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గాదాసు శంకరయ్య, గోనే శ్రీనివాస్, గోనే సత్యం, వేముల నరసయ్య, అయిల్లా లక్ష్మణ్, తిప్పని శ్రీనివాస్, నర్సింగ్ రోజు తిరుపతి, రాయమల్లు, మల్లేష్, సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.