ఎంబీబీఎస్ సీటు సాధించిన గాజుల పద్మావతికి ఘన సన్మానం
*ఎంబీబీఎస్ సీటు సాధించిన గాజుల పద్మావతికి ఘన సన్మానం* * *మన ప్రజావాణి* మందమర్రి:- పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గాజుల శంకర్ కుమార్తె గాజుల పద్మావతి నీట్ లో ఉత్తమ ర్యాంకు సాధించి, ఎంబీబీఎస్ సీటు పొందిన సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఆర్ఎంపీ భవన్ లో మందమర్రి పట్టణ, గ్రామీణ ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అనుభవ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం ఆద్వర్యంలో పద్మావతిని శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందన పత్రాన్ని అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు....