📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalవరంగల్ జిల్లా బాలుర జూనియర్ కబడ్డీ జట్టుకు క్రీడా దుస్తులు పంపిణీ

వరంగల్ జిల్లా బాలుర జూనియర్ కబడ్డీ జట్టుకు క్రీడా దుస్తులు పంపిణీ

📰 Generate e-Paper Clip

*వరంగల్ జిల్లా బాలుర జూనియర్ కబడ్డీ జట్టుకు క్రీడా దుస్తులు అందించిన
* వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్,, పుల్లూరి శ్రీనివాస్ గౌడ్

సెప్టెంబర్ 25 ప్రజావాణి న్యూస్/సంగెం

వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా సైనిక్ స్కూల్ అశోక్ నగర్ లో కొనసాగుతున్న జూనియర్ బాలుర కబడ్డీ శిక్షణ శిబిరంలో వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ అధ్యక్షతన నిర్వహించిన క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్సార్ యూనివర్సిటీ వరంగల్ డాక్టర్,, పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి వరంగల్ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్ర స్థాయి బాలుర కబడ్డీ పోటీల్లో పాల్గొనే వరంగల్ జిల్లా బాలుర కబడ్డీ జట్టుకు క్రీడా దుస్తులు అందించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో వరంగల్ జిల్లా జట్టు విజయం సాధించాలని క్రీడాకారులు క్రమశిక్షణతో తమ నైపుణ్యాలను కనబరిచి తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనాలని, క్రీడాకారుల అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని, కబడ్డీ క్రీడ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ కబడ్డీ శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని వరంగల్ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా కృషి చేయాలని వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ నుండి క్రీడాకారులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమ ప్రత్యేక అతిధులు సైనిక్ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అనూష, సైనిక్ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్, సాయిలు మాట్లాడుతూ వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సైనిక్ స్కూల్లో కబడ్డీ క్యాంపు నిర్వహించడం ఆనందదాయకమని, క్రీడాకారులు ప్రతిరోజు క్రమశిక్షణతో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారని రాష్ట్రస్థాయి పోటీలో వరంగల్ జిల్లా జట్టు విజయం సాధించాలని కోరారు..ఈ యొక్క కార్యక్రమంలో వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి ముఖర్జీ ,సహాయ కార్యదర్శి కక్కెర్ల మల్లికార్జున్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవీందర్, నర్సంపేట స్టేడియం ఇన్చార్జి కబడ్డీ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, సైనిక్ స్కూల్ లెఫ్ట్నెంట్ కల్నల్ కిరణ్, సైనిక్ స్కూల్ స్కూల్ ఉపాధ్యాయ బృందం మహేష్,తిరుపతి కబడ్డీ క్రీడాకారులు తదితరులుపాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.