📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriపేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా

పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా

📰 Generate e-Paper Clip

*పేద కుటుంబాలకు రేషన్ కార్డు భరోసా…*

*ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25*

పేద , మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం లో రేషన్ కార్డులు ఎంతో కీలకమని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్య క్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ. రేషన్ కార్డు కేవలం నిత్యావసర సరు కులు పొందేందుకు మాత్రమే కాకుండా , పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత కల్పించే ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉప యోగపడుతుందని తెలిపారు. రేషన్ కార్డు చేతిలో ఉంటే పేద కుటుంబాలకు ప్రభుత్వం తమ వెంట ఉందనే నమ్మకం , భరోసా కలుగు తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా 3.42 కోట్ల మందికి ఆహార భద్రత యూనిట్లను అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రజలకు మరింత విస్తృతంగా ఆహార భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడు తోందన్నారు. రాష్ట్రంలో 15 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు , 62 లక్షల మందికి ఆహార భద్రత కార్డుల ద్వారా ప్రయోజనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని బీర్ల ఐలయ్య తెలిపారు. మహి ళలకు ఆర్థిక , సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. మహిళల ప్రయాణ సౌకర్యం కోసం మహాలక్ష్మి పథకం , గృహ విద్యుత్ భారం తగ్గించేందుకు గృహ జ్యోతి , అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళా కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలు స్తోందన్నారు. పేద ప్రజల జీవితాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మార్పు తీసుకురావాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసు కుంటామని , సంక్షేమ పథకాల ప్రయోజనాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారు లు , ప్రజాప్రతినిధులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.