జోగిపేట ఎంఈఓ కార్యాలయం ఎదుట మద్యం బాటిల్
జోగిపేట: అందోల్– సెప్టెంబర్ 25 మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
జోగిపేట ఎంఈఓ కార్యాలయం ఎదుట మద్యం బాటిల్ కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖకు సంబంధించిన కార్యాలయం పరిసరాల్లో మద్యం బాటిల్ పడివుండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సెస్ శాఖ నిద్రపోతున్నారా లేక పట్టించుకోవడం లేదా అని పలువురు వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా బెల్టు షాపులు ఉండటంతో మందుబాబులకు అడ్డు అలుపు లేకుండా పోయింది. దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరియు
పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకపోకలు సాగించే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మద్యం బాటిల్ అక్కడికి ఎలా వచ్చిందనే విషయంపై సంబంధిత అధికారులు పరిశీలించాలని వారు కోరుతున్నారు.

