📄 ePaper
Epaper 2
Friday, September 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసజ్జనార్‌పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు వీరశైవ జంగమ సమాజం

సజ్జనార్‌పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు వీరశైవ జంగమ సమాజం

📰 Generate e-Paper Clip

సజ్జనార్‌పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు
వీరశైవ జంగమ సమాజం

విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల్లో రాజకీయ పాటలకు దూరంగా ఉండాలి

ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి తీవ్రంగా వ్యతిరేకించారు. పోలీస్ కమిషనర్‌ను ఉద్దేశించి వ్యక్తిగతంగా, హెచ్చరికల ధోరణిలో మాట్లాడటం ఆయన ఉన్నత స్థానానికి తగదని అన్నారు.వినాయక నిమజ్జన వేడుకల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు,రెచ్చగొట్టే లేదా అసభ్యకరమైన పాటలు, నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజేలు వినియోగించడంపై పోలీసులు చర్యలు తీసుకుంటామని సజ్జనార్ ఇటీవల హెచ్చరించారు.గణేశ్ నిమజ్జనం భక్తిశ్రద్ధలతో జరగాలని, రాజకీయ కార్యక్రమంగా మారకూడదని ఆయన పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సజ్జనార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాటలపై ఆంక్షలు విధించేందుకు సజ్జనార్ ఎవరు అంటూ ప్రశ్నిస్తూ,బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.ఈ వ్యాఖ్యలపై సదానిరంజన్ సిద్ధాంతి స్పందిస్తూ ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన పాటల వల్లనైనా ఉత్సవాల పవిత్రతకు భంగం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.అయితే పోలీస్ అధికారిని ఉద్దేశించి వ్యక్తిగత హెచ్చరికలు చేయడం, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని ఆయన అన్నారు.ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా అర్చక సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుందని హెచ్చరించారు.విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలు,నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా,భక్తి వాతావరణంలో జరిగేలా అన్ని వర్గాలు సహకరించాలని సదానిరంజన్ సిద్ధాంతి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.