📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూకట్‌పల్లిలో నేడు వినాయక శోభాయాత్ర..

కూకట్‌పల్లిలో నేడు వినాయక శోభాయాత్ర..

📰 Generate e-Paper Clip

కూకట్‌పల్లిలో నేడు వినాయక శోభాయాత్ర.. అంగరంగ వైభవంగా గణనాథుడి సాగనంపు!

ఉదయం 9 గంటలకు శోభాయాత్ర ప్రారంభం.. సాయంత్రం 6 గంటలకు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 25 (ప్రజావాణి): కూకట్‌పల్లిలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం శ్రీ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక శోభాయాత్ర నిర్వహించనున్నారు. కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
ఉదయం 9 గంటలకు శ్రీ సీతారామచంద్ర దేవస్థానం, బజరంగ్ హనుమాన్ ఆలయం, కూకట్‌పల్లి గ్రామం మీదుగా శోభాయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు కూకట్‌పల్లి నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్‌లోని గంగమ్మ ఒడిలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలకాలని నిర్వాహకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.