📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజోగిపేటలో నిమజ్జన ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్

జోగిపేటలో నిమజ్జన ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్

📰 Generate e-Paper Clip

జోగిపేటలో నిమజ్జన ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్

జోగిపేట, సెప్టెంబర్ 25: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

అందోల్–జోగిపేట పట్టణంలో నిన్న నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు యువకులు గాయపడిన ఘటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ విద్యుత్ తీగలు, రోడ్లు తదితర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జోగిపేట సీఐ అనిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.