📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకోరపల్లిలో పశువులకు అడ్డాగా పశు వైద్యశాల

కోరపల్లిలో పశువులకు అడ్డాగా పశు వైద్యశాల

📰 Generate e-Paper Clip

కోరపల్లిలో పశువులకు అడ్డాగా పశు వైద్యశాల

* వార్డ్ మెంబర్ ఇష్టారాజ్యం

జమ్మికుంట సెప్టెంబర్ 24 (ప్రజావాణి)

జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామీణ పశు వైద్యశాల పశువులకు అడ్డాగా మారింది గ్రామంలోని పశువులకు వైద్యం పాడి పశువుల రక్షణ నిమిత్తం ప్రభుత్వం గ్రామీణ పశు వైద్యశాల పేరిట పశువైద్యశాలను 1973లో నిర్మించింది. అప్పట్లో దానిని జిల్లా పశు వైద్యాధికారి ప్రారంభించారు పాడి సస్యరక్షణ లక్ష్యంగా ఈ పశు వైద్యశాలలో సేవలందించాలని భావించారు కానీ, గ్రామంలోని ఒక పాలకవర్గ సభ్యుడు దానిని పశువులకు అడ్డాగా మార్చిఏకంగా కార్యాలయం లోపల వరిగడ్డినీ పెట్టితమ సొంత పాకలాగా మార్చుకొని పశువులను అక్కడే నివాసంగా మార్చడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం లోపల పశువులను పెట్టి బయట తాళాలు సైతం వేస్తూ ఉండటం గమనార్హం. ముఖ్యంగా రైతులు తమ పశువులు ఇతర వైద్యం నిమిత్తం పశు వైద్యశాలకు వస్తే ఆ విభాగ వైద్య శాఖ వారు డాక్టర్లు, సిబ్బంది అక్కడ సేవలందించేందుకు వీలుగా ఉంటుందివార్డుమెంబర్.నిర్వాకంతో ప్రస్తుతం కోరపల్లి గ్రామీణ పశు వైద్యశాల ఓ రకంగా పశువుల నివాస అడ్డాగా మారడం పట్ల గ్రామస్తుల నుండి తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సదరు వార్డ్ మెంబర్ తీరు సరికాదని, పశువులను ప్రభుత్వ గ్రామీణ పశు వైద్యశాల ఆవరణలో పెట్టడం సమంజసం కాదని, వార్డ్ మెంబర్ పై పశు వైద్య అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ భవనంగా ఉన్న పశువైద్యశాలను తమ పాకలాగా మార్చుకోవడం అంటే తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడమేనని, సదరు సభ్యుడి పై గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మిగతా పాలకవర్గ సభ్యులు కూడా సంబంధిత అధికారులకు చర్యలు తీసుకునే విధంగా పాలకవర్గ సమావేశంలో అదేవిధంగా గ్రామ సభ లో కూడా అతనిపై కఠినమైన చర్యలకు ఆదేశించాలని గ్రామ ప్రజలు తెలిపారు. గతంలో ఇదే పశువైద్యశాలలో పందులు కూడా నివసించేవని. వాటిని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే చర్యలు చేపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా ఇతనిపై కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.